వైఎస్ జగన్ గెలుపు ఒక సునామి అని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. జగన్ పై ప్రజలకు అపారమైన నమ్మకం ఉందని... ఆ నమ్మకమే... ఆయన భారీ గెలుపునకు కారణం అయ్యిందని బొత్స పేర్కొన్నారు.

ఏపీ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే 80 స్థానాలు గెలిచిన వైసీపీ...మరో 75 స్థానాల్లో ఆధిక్యంలో దూసుకుపోతోంది. ఈ భారీ విజయం తర్వాత బొత్స మీడియాతో మాట్లాడారు.

జగన్ నాయకత్వంలో అభివృద్ధి జరుగుతుందని ప్రజలు విశ్వసించారని బొత్స చెప్పారు. ఐదేళ్లు అభివృద్ధి చేసే అవకాశాన్ని చంద్రబాబు దుర్వినియోగం చేశారని విమర్శించారు. అవినీతి కార్యక్రమాలు చేసిన టీడీపీకి భిన్నంగా తమ పాలన ఉంటుందని చెప్పారు. చంద్రబాబు పథకాలపై ప్రజలకు నమ్మకం లేదని ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదని, మెజారిటీలు ఉహించినవేనని బొత్స వ్యాఖ్యానించారు.