ఏపీలో తారాస్థాయికి చేరుకుంది. అధికార, ప్రతిపక్షాలు ఎత్తుకు పైఎత్తు వేసుకుంటూ ముందుకు వెళ్తున్నాయి. నామినేషన్ ప్రక్రియ కూడా పూర్తయిపోవడంతో అన్ని పార్టీల అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేసేశారు. పార్టీ అధినేతలు సైతం తమ అభ్యర్థుల కోసం రోజుకు రెండు మూడు జిల్లాల్లో పర్యటిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. తాజాగా వైసీపీకి ఓ షాక్ తగిలింది. కీలకనేత ఒకరు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇంతకీ మ్యాటరేంటంటే.. ఈ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని వైసీపీ ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా వైసీపీ  ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జిల్లాల్లో అనంతపురం ఒకటి. ఆ జిల్లాలో ఈ ఎన్నికల్లో వీలైనన్ని ఎక్కువ స్థానాలను కైవశం చేసుకోవాలని ఆ పార్టీ భావిస్తోంది. 

ఇలాంటి సమయంలో పెద్ద పప్పూర్ మండల వైసీపీ కన్వీనర్‌ రఘునాథ్‌రెడ్డి సహా వందలాది మంది కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చేరారు. తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో వాళ్లంతా సైకిల్ ఎక్కేశారు. ఈ నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున ప్రభాకర్ రెడ్డి తనయుడు జేసీ అస్మిత్ రెడ్డి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.