Asianet News TeluguAsianet News Telugu

ప్రజాశాంతి అభ్యర్థులు: చిరుపై పడిన దెబ్బనే జగన్ పై...

ఒకే విధంగా పేర్లున్న అభ్యర్థులను బరిలోకి దింపడం, ఒకేమాదిరిగా వైసీపీ కండువా, వైసీపీ గుర్తుకు దగ్గర ఉండేలా ప్రజాశాంతి పార్టీ గుర్తు, కండువా ఉండటంతో వైసీపీ కాస్త గందరగోళానికి గురవుతున్నదనడంలో ఎలాంటి సందేహం లేదు. దాదాపు 35 అసెంబ్లీ స్థానాలతోపాటు నాలుగు పార్లమెంట్ స్థానాల్లో ఇదే పరిస్థితిని ఎదుర్కొంటోంది. అయితే ఈ సీన్ గతంలో మెగాస్టార్ చిరంజీవికి ఎదురైందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. 
 

YCP is facing same problem with Prajashanthi candidates, what Prajarajyam faced earlier
Author
Vijayawada, First Published Mar 29, 2019, 5:48 PM IST

విజయవాడ: రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలని పక్కా వ్యూహంతో ముందుకెళ్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ దెబ్బతో విలవిలలాడుతోంది. 

ఒకే విధంగా పేర్లున్న అభ్యర్థులను బరిలోకి దింపడం, ఒకేమాదిరిగా వైసీపీ కండువా, వైసీపీ గుర్తుకు దగ్గర ఉండేలా ప్రజాశాంతి పార్టీ గుర్తు, కండువా ఉండటంతో వైసీపీ కాస్త గందరగోళానికి గురవుతున్నదనడంలో ఎలాంటి సందేహం లేదు. 

దాదాపు 35 అసెంబ్లీ స్థానాలతోపాటు నాలుగు పార్లమెంట్ స్థానాల్లో ఇదే పరిస్థితిని ఎదుర్కొంటోంది. అయితే ఈ సీన్ గతంలో మెగాస్టార్ చిరంజీవికి ఎదురైందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. 

2009లో ప్రజారాజ్యం పార్టీ పోటీ చేసినప్పుడు స్వతంత్ర అభ్యర్థులు బరిలో దిగారు. అప్పుడు కూడా ఒకే విధంగా ఉండే పేర్లతోపాటు రైలు ఇంజన్ గుర్తును పోలిన గొంగళి పురుగు గుర్తు ఉండటం వల్ల ఆ ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీకి గట్టి దెబ్బే తగిలిందని చెప్పుకోవాలి. 

పేర్లు ఒక్కటవ్వడం, గుర్తు దాదాపుగా ఒకేలా ఉండటంతో ప్రజారాజ్యం పార్టీకి మైనస్ అయ్యిందని స్వయంగా మెగాస్టార్ చిరంజీవే చెప్పుకొచ్చారు. ఇదంతా కాంగ్రెస్ పార్టీ కావాలనే చేసిందని చిరంజీవి ఆరోపించారు కూడా. అదేసీన్ ఇప్పుడు రిపీట్ అయ్యిందని ప్రచారం జరుగుతోంది. ఇకపోతే 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ ఇబ్బందులు ఎదుర్కొన్న నియోజకవర్గాలను చూద్దాం.

1. తుని(తూర్పుగోదావరి జిల్లా)
రొంగలి లక్ష్మి( పీఆర్పీ)
రొంగలి లక్ష్మి(ఇండిపెండెంట్)

2.కాకినాడ సిటీ
బి హరి(పీఆర్పీ)
బి హరి(ఇండిపెండెంట్)

3.రామచంద్రాపురం
తోట త్రిమూర్తులు(పీఆర్పీ)
బండి త్రిమూర్తులు(ఇండిపెండెంట్)

4.నంద్యాల(కర్నూలు)
1. ఏవీ సుబ్బారెడ్డి(పీఆర్పీ)
2. ఏవీ సుబ్బారెడ్డి(ఇండిపెండెంట్)

5. పలాస(శ్రీకాకుళం)
వి నాగేశ్వరరావు(పీఆర్పీ)
కె నాగేశ్వరరావు(ఇండిపెండెంట్)

6.చిత్తూరు
ఎ.శ్రీనివాసులు(పీఆర్పీ)
ఎస్.శ్రీనివాసులు(ఇండిపెండెంట్)

7.తిరుపతి
కె. చిరంజీవి(పీఆర్పీ)
టి. చిరంజీవి(ఇండిపెండెంట్)

8.చెన్నూరు
ఏ శ్రీనివాస్(పీఆర్పీ)
వి శ్రీనివాస్(ఇండిపెండెంట్)

9.అనకాపల్లి(విశాఖపట్నం)
గంటా శ్రీనివాసరావు(పీఆర్పీ)
గంజి శ్రీనివాసరావు(ఇండిపెండెంట్)

10.దెందులూరు(పశ్చిమగోదావరి)
అశోక్ గౌడ్(పీఆర్పీ)
అశోక్ కుమార్(ఇండిపెండెంట్)

11.గుంటూరు ఈస్ట్(గుంటూరు)
షేక్ షౌకత్(పీఆర్పీ)
షేక్ షౌకత్ అలీ(ఇండిపెండెంట్)

12. ఆత్మకూరు(నెల్లూరు)
షేక్ కాజా(పీఆర్పీ)
షేక్ బాషా(ఇండిపెండెంట్)

ఆనాడు ప్రజారాజ్యం పార్టీ ఎదుర్కొన్న ఇబ్బందులే ఇప్పుడు వైసీపీ ఎదుర్కోంటుంది. దీంతో ఏం చెయ్యాలో తోచక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తర్జన భర్జన పడుతోంది. ఆనాడు పేర్లు కన్ఫ్యూజ్ చేసినా కొంతమంది గెలిచారు. అదే ఆశతో ఉంది వైసీపీ. మరి ఏం జరుగుతుందో చూడాలి. 

Follow Us:
Download App:
  • android
  • ios