నెల్లూరు నగరంలోని చిన్న బజార్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నగదు నిల్వలు వెలుగు చూడటం కలకలం రేపింది. ఇక్కడ నగదును నిల్వ ఉంచినట్లుగా గుర్తించిన వైసీపీ కార్యకర్తలు.. డబ్బును తరలిస్తుండగా పట్టుకొని పోలీసులకు అప్పగించారు.

ఈ ఘటనలో 18 లక్షల నగదు స్వాధీనం చేసుకోగా... 20 లక్షల బ్యాగ్‌తో మరో వ్యక్తి పారిపోయాడు. ఈ వ్యవహారంలో ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరంతా నారాయణ విద్యాసంస్థల సిబ్బందిగా తెలుస్తోంది. సమాచారం అందుకున్న స్థానిక వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు.