ఎన్నికల వేళ విశాఖ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఎన్నికల విధులకు వెళ్తూ ఓ మహిళా హెడ్ కానిస్టేబుల్ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు.
ఎన్నికల వేళ విశాఖ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఎన్నికల విధులకు వెళ్తూ ఓ మహిళా హెడ్ కానిస్టేబుల్ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. వివరాల్లోకి వెళితే... విశాఖ పీఎంపాలెం పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ఎం. లక్ష్మీకాంతంకు అక్కిరెడ్డిపాలెంలో అధికారులు ఎన్నికల డ్యూటీ వేశారు.
విధుల్లో పాల్గొనేందుకు ఆమె తన మోటార్ సైకిల్‌పై గురువారం తెల్లవారుజామున ఇంటి నుంచి బయలుదేరారు. జాతీయ రహదారిపై వెళుతుండగా స్థానిక పంజాబ్ జంక్షన్ వద్ద ఎదురుగా వస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాల పాలైన లక్ష్మీకాంతంను ఎయిర్‌పోర్ట్ పోలీసులు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ఆమె మరణించారు. ఇమెకు ఇద్దరు పిల్లలున్నారు.
