దేశవ్యాప్తంగా జరిగిన ఎన్నికల ఫలితాలు విడుదలవ్వడానికి ఇంకా కొద్ది గంటలే సమయం ఉంది. గురువారం ఉదయం 8గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం అవుతుంది. దేశ రాజకీయాలతోపాటు... ఏపీలో ఎవరు అధికారం చేపడతారా అన్న విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కాగా... ఈ ఫలితాల నేపథ్యంలో మందు బాబులకు మాత్రం తిప్పలు తప్పడం లేదు.

ఓట్ల లెక్కింపు నేపథ్యంలో కోడ్ అమలులో ఉంటుంది. దీంతో...మద్యందుకాణాలన్నీ మూత పడనున్నాయి. న్నికల సంఘం నిబంధనల ప్రకారం కౌంటింగ్ ఉండటంతో.. మద్యం దుకాణాలు, వైన్స్‌, బార్లు, కల్లు దుకాణాలు మూసివేయాలని ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 

ఈసీ ఆదేశాలతో మద్యం షాపులు బంద్ చేయాలని ఆదేశించారు. 23న (గురువారం) ఉదయం 6 గంటల నుంచి 24 ఉదయం 6 గంటల వరకు మద్యం షాపులు మూసే ఉంటాయి. నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు తప్పవని ఎక్సైజ్ అధికారులు హెచ్చరిస్తున్నారు.