అమరావతి: జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ సమక్షంలో మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ జనసేనలో చేరారు. శనివారం అర్ధరాత్రి పవన్‌తో జేడీ లక్ష్మీనారాక్ష్ బేటీ అయ్యారు. ఆదివారం నాడు లక్ష్మీనారాయణ జనసేన తీర్థం పుచ్చుకొన్నారు.

సమసమాజ నిర్మాణం కోసం ఇద్దరి మధ్య చర్చలు జరిగినట్టుగా లక్ష్మీనారాయణ చెప్పారు. జనసేనలో చేరిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు.భారతదేశం యువతరంతో ఉత్సాహంతో ఉందన్నారు.  రాజకీయాల్లో మార్పు తెచ్చే నేత పవన్ కళ్యాణ్ అని ఆయన అభిప్రాయపడ్డారు.

నాలుగైదు రోజుల క్రితం లక్ష్మీనారాయణ టీడీపీలో చేరుతారని ప్రచారం సాగింది. విశాఖ జిల్లాలోని భీమిలి నుండి లక్ష్మీనారాయణ పోటీ చేస్తారని కూడ చెప్పారు.అదే సమయంలో వైసీపీ లక్ష్మీనారాయణపై విమర్శలు గుప్పించింది.

ఈ తరుణంలో జేడీ లక్ష్మీనారాయణ టీడీపీలో చేరలేదు. శనివారం రాత్రి పవన్‌తో లక్ష్మీనారాయణ బేటీ అయ్యారు. జనసేనలో చేరాలని నిర్ణయం తీసుకొన్నారు.విశాఖ జిల్లా నుండి  లక్ష్మీనారాయణ పోటీ చేసే  అవకాశం ఉందని సమాచారం.