Asianet News TeluguAsianet News Telugu

లగడపాటికి పోలీసు ప్రొటెక్షన్ తప్పదు... విజయసాయి రెడ్డి

ఏపీ ఎన్నికల్లో గెలుపుపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. అదేవిధంగా లగడపాటి ఎక్సిట్ పోల్స్ పై.. చంద్రబాబు ఢిల్లీ మీటింగ్ లపై కూడా విజయసాయి రెడ్డి సెటైర్లు వేశారు.

vijayasai reddy tweets on lagadapati survey and counter to chandrababu
Author
Hyderabad, First Published May 20, 2019, 1:57 PM IST

ఏపీ ఎన్నికల్లో గెలుపుపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. అదేవిధంగా లగడపాటి ఎక్సిట్ పోల్స్ పై.. చంద్రబాబు ఢిల్లీ మీటింగ్ లపై కూడా విజయసాయి రెడ్డి సెటైర్లు వేశారు. రాజగోపాల్ సర్వేలో ఆయన మెదడును ఆయన డీఎన్ఏ డామినేట్ చేసిందని ఎద్దేవా చేశారు.

‘‘లగడపాటి ఎగ్జిట్ పోల్ సర్వేను నమ్మి ఎగ్జయిట్ అయిన తెలుగు తమ్ముళ్లు 23 తర్వాత తేడా వస్తే ఆయన్ను నిలదీసేట్టున్నారు. పార్టీ ఓడి, బెట్టింగుల్లో నష్టపోయినోళ్లు ఊరుకుంటారా? మాజీ ఎంపీవి కాబట్టి పోలీసు ప్రొటెక్షన్ అడగొచ్చు తప్పులేదు. బాబు, కిరసనాయిలు రేపటి నుంచి నీ ఫోన్లు కూడా ఎత్తరు .’’ అని సెటైర్ వేశారు.

‘‘పొరుగు రాష్ట్రం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్‌ వినాశనాన్ని కోరుకుంటుందని బోరున విలపించిన బాబు ఇప్పుడు చేస్తున్నదేమిటో? తెలుగు ప్రజల ఆత్మగౌరవం నినాదంతో పుట్టిన తెలుగుదేశం పార్టీని సోనియా, ఉత్తరాది నేతల పాదాల ముందు పడేశాడు. ఎప్పుడు కలవాలో ఎప్పుడు విడి పోవాలో ఈయనకంటే వాళ్లకు బాగా తెలుసు.’’ అని కౌంటర్ వేశారు.

‘‘ఢిల్లీలో చంద్రబాబును అందరూ ‘ఫెవికాల్ బాబా’ అని పిలుస్తున్నారు. పిలవని పేరంటంలా అందరి ఇళ్లపై పడి ఫోటోలు దిగుతూ, వాళ్లను కలుపుతా వీళ్లను ఏకం చేస్తా అంటుంటే ఈ నిక్ నేమ్ తగిలించారట. ఎవరి టెన్షన్లలో వాళ్లుంటే సమయం, సందర్భం లేకుండా ఈ ఫెవికాల్ రాయబారాలేమిటని జోకులేసుకుంటున్నారట.’’ అని సైటర్లు వేశారు.

‘‘యూపీఏ, మాయా-అఖిలేశ్ ఫ్రంటులు చతికల పడ్డాయి. చంద్రబాబు గ్రాఫ్ ఢమాల్ అన్న విషయం కూడా వాళ్లకి అర్థమైంది. లగడపాటి సర్వేను అందరికీ చూపించబోగా విసుక్కున్నారట. పాపం అటు ఇటు కాకుండా పోయాడు బాబు.’’ అని ఎద్దేవా చేశారు. 

‘‘ఏడో దశ ఎన్నికల్లో తీరిక లేకుండా ఉంటే చంద్రబాబు వెళ్లి మాయా, అఖిలేశ్, రాహుల్, పవార్లను ఫోటో సెషన్ల కోసం హింస పెడుతున్నాడట. సొంత రాష్ట్రంలో గెలిచే సీన్‌ లేక ఢిల్లీ, లక్నోలలో తిరుగుతున్నాడు. ఎన్డీఏ యేతర పార్టీలు అస్థిత్వ సమస్యను ఎదుర్కొంటుంటే ఐక్యత చర్చలంట.’’ అని ట్వీట్ చేశారు.

‘‘ప్రజలు ఓటుకు 2 వేలు డిమాండు చేస్తున్నారని చంద్రబాబు శోక సముద్రమయ్యాడు. అసలా సంస్కృతికి పితామహుడివే నువ్వు కదా బాబూ. ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొనే సంప్రదాయం మొదలు పెట్టిందెవరు? ఓటుకు నోటు కేసులో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన తర్వాత కూడా నీతిమాలిన పనులకు తెగబడ్డావు.’’ అని ట్విట్టర్ లో పేర్కొన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios