వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మరోసారి ట్విట్టర్ వేదికగా చంద్రబాబు, లోకేష్ లపై మండిపడ్డారు. మంగళగిరిలో లోకేష్ ని గెలిపించేందుకు  చంద్రబాబు నానా తిప్పలు పడుతున్నారన్నారు. ఇటీవల వైసీపీలోకి సినీనటులు అలీ, జయసుధలు చేరిన సంగతి తెలిసిందే. కాగా.. వారు వైసీపీలో చేరికపై చంద్రబాబు చేసిన కామెంట్స్ పై విజయసాయి ట్విట్టర్ వేదికగా కౌంటర్ వేశారు.

‘‘జయసుధ, ఆలీ వైఎస్సార్ కాంగ్రెస్‌లో ఎలా చేరతారు?తిత్లీ తుఫాన్ వచ్చినపుడు వాళ్లిద్దరు ఎక్కడికెళ్లారని ప్రశ్నిస్తున్నారంటే మీకు నిజంగా ఏదో అయినట్లే ఉంది చంద్రబాబూ?వంద కోట్ల టిటిడి నిధులను దోచిపెట్టిన కె.రాఘవేంద్రరావు, బి.ఎ బాధితులను పరామర్శించాడా? కేజ్రీవాల్, మాయావతి,మమతలు ఓదార్చారా?’’ అంటూ విజయసాయి ట్వీట్ చేశారు.

‘‘మంగళగిరిలో పప్పునాయుడు గెలుపు కోసం ఓటుకు పది వేలు పంపిణీ చేస్తున్నారు. కూపన్లు ఇస్తున్నారట. వాటిని గుంటూరులోనో, విజయవాడలోనో ఫలానా వ్యక్తికి చూపిస్తే డబ్బు చెల్లిస్తారట. ఎన్ని తాయిలాలు ముట్ట చెప్పినా ఆర్కే గెలుపును ఆపడం చంద్రబాబు తరం కాదు.’’ అని మరో ట్వీట్ లో పేర్కొన్నారు.