వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి లోకేష్ పై సెటైర్ల వర్షం కురిపించారు. ప్రస్తుతం లోకేష్ ఎన్నికల ప్రచారంలో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. కాగా ఆ ఎన్నికల ప్రచారంలో లోకేష్ చేసిన సిల్లీ మిస్టేక్స్ పై విజయసాయి రెడ్డి కౌంటర్లు వేశారు. లోకేష్ ని చిట్టినాయడు అని ప్రస్తావిస్తూ ట్వీట్లు చేశారు.

‘‘మచిలీపట్నం పోర్టును తెలంగాణాకు తీసుకెళ్లాలని కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారన్న లోకేశ్ వ్యాఖ్యలు యూట్యూబ్, సోషల్‌ మీడియాలో వైరల్ అయ్యాయి. యూట్యూబ్‌లో ఈ వీడియోలను రెండు కోట్ల మంది చూశారు. వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్లలో లక్షకు పైగా షేర్ అయ్యాయి. చిట్టి నాయుడా మజాకా?’’ అని సెటైర్ వేశారు.

మరో ట్వీట్ లో ‘‘వచ్చే నాలుగు రోజుల్లో 20 నియోజకవర్గాల్లో సుడిగాలి ప్రచారం నిర్వహించాలని ఉబలాటపడ్డ లోకేశ్‌కు అభ్యర్థుల నుంచి సహాయ నిరాకరణ ఎదురవుతోంది. మా తిప్పలేవో మేం పడతాం. మీరు మంగళగిరి చూసుకోండి చాలు అని చెబుతున్నారట. పాపం చిట్టినాయుడు పసి మెదడుకు లాజిక్ అర్థం కావడం లేదు!’’ అని మరో సెటైర్ వేశారు.

‘‘మీకు దండం పెడతాం. చంద్రబాబు, లోకేశ్, మమతా బెనర్జీల ప్రచారాలు వద్దు. ఒకటి చెప్పబోయి ఇంకోటి అంటుంటే ఓటర్లు నవ్వుకుంటున్నారు. ప్రచారాన్ని వదిలి మేం జన సమీకరణ చేయాల్సి వస్తోందని తెలుగుదేశం అభ్యర్థులు వాపోతున్నారు. పార్టీ కార్యాలయ బాధ్యులకు ఫోన్లు చేసి అల్టిమేటం ఇస్తున్నారట.’’ అని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు.