జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రతిదానికీ పవన్ తాట తీస్తా అని అంటారని..కానీ ఉల్లిపాయ పొట్టుకూడా తీయలేరంటూ విజయసాయి రెడ్డి పేర్కొన్నారు.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రతిదానికీ పవన్ తాట తీస్తా అని అంటారని..కానీ ఉల్లిపాయ పొట్టుకూడా తీయలేరంటూ విజయసాయి రెడ్డి పేర్కొన్నారు.

ట్విట్టర్ వేదికగా విజయసాయి రెడ్డి పవన్ పై విమర్శల వర్షం కురిపించారు. ‘‘ నువ్వొక అమ్ముడు పోయిన వ్యక్తివి. ఉల్లిపాయ మీద పొట్టు కూడా తీయలేవు పవన్ కళ్యాణ్. అమాయకుల అభిమానాన్ని తాకట్టు పెట్టి నాలుగు రాళ్లు సంపాదించుకునేందుకు వచ్చినోడివి. ఏప్రిల్‌ 11 వరకు గంతులేసి వెళ్లు. నీ బతుక్కు తాటలు తీయడమొకటా? నీ యజమాని చంద్రబాబే అన్ని సర్ధుకుంటున్నాడు.’’ అని విజయసాయి రెడ్డి అన్నారు.

మరో ట్వీట్ లో.. ఎన్నికలు ఎలాగూ ఏక పక్షమని తేలిపోయింది. జగన్ గారు కాబోయే ముఖ్యమంత్రి అని ప్రజలు ఆశీర్వచనాలు పలుకుతున్నారు. ఈ ఉద్విగ్న భరిత సమయంలో కామెడీ పండించిన పాల్, పావలా, పప్పులకు ధన్యవాదాలు ముందే చెప్పాలి. కులగజ్జి మీడియాను మాత్రం ఎలా ఓదార్చాలో అర్థం కావడం లేదు.’’ అని పేర్కొన్నారు.