న్యూఢిల్లీ: ఏపీ రాష్ట్రంలో ఐపీఎస్ అాధికారులపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సోమవారం నాడు మరోసారి ఫిర్యాదు చేశారు.

ఏపీ రాష్ట్ర ఇంటలిజెన్స్ డీజీగా  పనిచేసిన వెంకటేశ్వరరావు ఇంకా కూడ టీడీపీికి అనుకూలంగా వ్యవహరిస్తున్నాడని ఆయన ఆరోపించారు. విధుల నుండి తప్పించినా కూడ ఆయన తన కిందిస్థాయి ఉద్యోగుల సహాయంతో టీడీపీకి నివేదికలను ఇస్తున్నారని ఆయన ఆరోపించారు.

గతంలో ఓఎస్డీలుగా పనిచేసిన యోగానంద్, మాధవరావులు కూడ టీడీపీ కోసం పనిచేస్తున్నారని విజయసాయిరెడ్డి ఆరోపణలు చేశారు. లా అండ్ ఆర్డర్ డీఐజీ ఘట్టమనేని శ్రీనివాస్‌ను విధుల నుండి తప్పించాలని  విజయసాయిరెడ్డి కోరారు.

ఏపీ డీజీపీ ఠాకూర్ కనుసన్నల్లోనే ఈ తతంగం అంతా సాగుతోందని ఆయన ఆరోపించారు. డీజీపీ హెడ్‌క్వార్టర్స్ సహా ప్రతి జిల్లా కేంద్రంలో కూడ ఎన్నికల పరిశీలకులను  నియమించాలని  ఆయన సీఈసీని కోరారు.