చంద్రగిరిలో 5 పోలింగ్ బూతుల్లో రీ పోలింగ్ అంటేనే చంద్రబాబు వణికి పోతున్నారని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి  కౌంటర్ వేశారు. శనివారం ఉదయం సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్లిన సంగతి తెలిసిందే. కాగా.. దీనిపై విజయసాయి రెడ్డి స్పందించారు. 

చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని ఐదు కేంద్రాల్లో ఎన్నికల సంఘం రీ పోలింగ్‌కు ఆదేశించడాన్ని తప్పుబట్టేందుకు ఢిల్లీ వెళ్లిన సీఎం చంద్రబాబుపై విజయసాయిరెడ్డి మండిపడ్డారు. చంద్రగిరిలో 5 పోలింగ్ బూతుల్లో రీపోలింగ్‌ అంటేనే ఇంతగా వణికి పోతున్నారేంటి చంద్రబాబూ అని ట్విటర్‌లో ధ్వజమెత్తారు. 

'ఈసీపై దాడికి పురమాయించేంత తప్పేం జరిగిందని? ఏ పార్టీ ఓటర్లు ఆపార్టీకి ఓటేస్తారు. ఓడిపోయినట్లు గంగ వెర్రులెందుకు? పాతికేళ్ళుగా దళితులను ఓటు హక్కుకు దూరం చేసిన మీ నిజస్వరూపం బయటపడినందుకా?' అంటూ విజయసాయిరెడ్డి నిప్పులు చెరిగారు.