ఏపీ సీఎం చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మరోసారి విమర్శల వర్షం కురిపించారు. ఆయుర్వేదంలోని క్షారసూత్ర చికిత్స చంద్రబాబు కి చాలా అవసరం అంటూ విజయసాయి రెడ్డి ఎద్దేవా చేశారు.

‘‘ఎన్డీయేతర పార్టీలకు ఆధిక్యత వస్తే ప్రభుత్వం ఏర్పాటుకు పిలవాలని రాష్ట్రపతికి లేఖ రాయాలని సోనియాకు చంద్రబాబు ఈ ‘త్రిసూత్ర’ వ్యూహాన్నివివరించారని కుల మీడియా పారవశ్యంతో రాసింది. త్రిసూత్ర ఏమో కాని ‘క్షార సూత్ర’ అని ఆయుర్వేదంలో ఒక చికిత్స ఉంది. బాబుకు అర్జెంట్‌గా ఆ చికిత్స అవసరం.’’ అంటూ వ్యంగ్యంగా  కౌంటర్ వేశారు.

మరో ట్వీట్ లో చంద్రబాబు కేంద్రంలో చక్రం తిప్పుతోందంటూ ఎల్లో మీడియా ప్రచారం చేస్తోందని చెబుతూ.. ఆ ట్వీట్ కింద వెటకారంగా చక్రాలు, సైకిల్ టైర్లు వంటి బొమ్మలను పెట్టారు.