ఎగ్జిట్ పోల్స్ పై ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు స్పందించారు. ఎగ్జిట్ పోల్స్ కోసం ఎదురు చూడకుండా.. ఎగ్జాట్ పోల్స్ కోసం ఎదురు చూడాలన్నారు.
ఎగ్జిట్ పోల్స్ పై ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు స్పందించారు. ఎగ్జిట్ పోల్స్ కోసం ఎదురు చూడకుండా.. ఎగ్జాట్ పోల్స్ కోసం ఎదురు చూడాలన్నారు. ఆదివారం ఆయన గుంటూరు పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... 42 ఏళ్ల తర్వాత తొలిసారిగా తాను లేకుండా ఎన్నికలు జరిగాయని ఆయన అన్నారు.
తన రాజకీయ జీవితంలో ప్రజలు ఇచ్చిన సొమ్ముతోనే ఎన్నికలలో పోటీ చేసేవాళ్ళమని, నిత్యం ప్రజల మద్య తిరుగుతూ వాళ్లు చెప్పేది వినకపోతే తనకు మనశ్శాంతి ఉండదని అన్నారు. ప్రస్తుతం ప్రజలకు దూరం అయ్యానని, అయినా గౌరవపదమైన పదవిలో ఉన్నానని అన్నారు.
ఎన్నికల సమయంలో సుమారు రోజుకు 16 సభలలో పాల్గోనే వాడినని, ఉపరాష్ట్రపతిగా కూడా తన వంతు ప్రజా సేవకు కృషి చేస్తున్ననని వెంకయ్య నాయుడు అన్నారు. నేటి చట్టసభలు నడుస్తున్న తీరు బాధకరమని, రాజకీయ నేతల భాష అసభ్యకరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాలలో ఎవరూ ఎవరికీ శత్రువులు కారని, వ్యక్తిగత దూషణలు, పరుష పదజాలం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు.
