విజయవాడ: వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ స్టార్ కాంపైనర్ వంగవీటి రాధా నిప్పులు చెరిగారు. కాపుల శ్రేయస్సు కోసం మాట్లాడుతానంటే జగన్ వద్దన్నారని రాధా ఆరోపించారు. 

మంగళవారం విజయవాడలో మీడియాతో మాట్లాడిన రాధాకృష్ణ కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇవ్వాలని అడిగితే కుదరదన్నారని చెప్పారు. ఏనాడు కాపుల సంక్షేమం కోసం మాట్లాడేందుకు ఇష్టపడలేని వ్యక్తి వైఎస్ జగన్ అంటూ విమర్శించారు. 

రిజర్వేషన్లపై హామీ ఇవ్వకుండా ముష్టివేసినట్లు రూ.10వేల కోట్లు కాపులకు ఇస్తామన్నారని గుర్తుచేశారు. కాపుల సంక్షేమంపై చర్చించేందుకు తనకు అవకాశం ఇవ్వలేదని, కాపుల అభివృద్ధి పట్ల వైఎస్ జగన్ కు ఎలాంటి చిత్తశుద్ది లేదని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో జగన్‌కు కాపులు తగిన బుద్ధి చెప్పాలని వంగవీటి రాధాకృష్ణ పిలుపునిచ్చారు.