గుంటూరు:  వంగవీటి రాధా టీడీపీలో చేరడం రంగా అభిమానులను తీవ్రంగా కలిచివేస్తోందని వంగవీటి నరేంద్ర అభిప్రాయపడ్డారు. వంగవీటి రాధా చంద్రబాబునాయుడు సమక్షంలో  బుధవారం రాత్రి టీడీపీలో చేరిన విషయం తెలిసిందే.

గురువారం నాడు వంగవీటి నరేంద్ర మీడియాతో మాట్లాడారు. వంగవీటి రాధాను  ఆనాడు టీడీపీ ప్రభుత్వమే చంపించిందని ఆయన ఆరోపించారు. ప్రజల కోసం పోరాడిన రంగాను ప్రభుత్వమే కావాలని చంపించిందని  ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు.  

రంగా హత్యతో టీడీపీకి సంబంధం లేదని రాధా చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకొంటారని తాను భావిస్తున్నట్టుగా ఆయన చెప్పారు.రాధా టీడీపీలో చేరడం వల్ల వ్యక్తిగతంగా ఆయన లాభం కలుగుతోందేమోనని ఆయన అభిప్రాయపడ్డారు.