జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌  ఎన్నికల ప్రచార సభలో అసశ్రుతి చోటు చేసుకుంది. శుక్రవారం కర్నూలు జిల్లా నంద్యాలలో పవన్‌ కల్యాణ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అయితే సభా ప్రాంగణం వద్ద మైక్‌ సౌండ్‌ సెట్‌ తల మీద పడటంతో సిరాజ్‌ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. 

నంద్యాల: జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఎన్నికల ప్రచార సభలో అసశ్రుతి చోటు చేసుకుంది. శుక్రవారం కర్నూలు జిల్లా నంద్యాలలో పవన్‌ కల్యాణ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అయితే సభా ప్రాంగణం వద్ద మైక్‌ సౌండ్‌ సెట్‌ తల మీద పడటంతో సిరాజ్‌ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

వెంటనే అతడిని స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఆస్పత్రికి తరలించేలోగానే సిరాజ్‌ అతను మరణించాడు. దీంతో సభా ప్రాంగణం వద్ద కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పో

మృతి చెందిన సిరాజ్‌ నడిగడ్డ ప్రాంతానికి చెందిన ఆటోడ్రైవర్‌గా తెలిసింది. అతడికి ఇద్దరు కొడుకులు, ఒక కుమార్తె ఉన్నారు. అయితే కుమార్తె అంగవైకల్యంతో బాధపడుతోంది.