రాజమండ్రి: ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం మూటగట్టుకున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ని ఓదార్చే ప్రయత్నం చేశారు రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. 

అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో నిరాశచెందొద్దని సూచించారు. రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన ఉండవల్లి అరుణ్ కుమార్ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మనోధైర్యంగా ముందుకు వెళ్లాలని సూచించారు. 

ఒకప్పుడు కాన్షీరామ్ కూడా గెలవలేదని అలాగని ఆయన కృంగిపోలేదని ఆ తర్వాత గెలిచి పార్టీని నిలబెట్టారని గుర్తు చేశారు. అలాగే పవన్ కూడా పోరాడి పార్టీని నిలబెట్టాలని సూచించారు. 

ఇకపోతే 2019 ఎన్నికల్లో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ దారుణంగా ఓటమి పాలయ్యారు. ఆయన పోటీ చేసిన రెండు చోట్ల కూడా ఘోరపరాజయం పాలయ్యారు. 140 స్థానాల్లో పోటీ చేస్తే కేవలం ఒక్కసీటుతోనే సరిపెట్టుకున్నారు.