వైసీపీకి మద్దతుగా టీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రచారం చేయనున్నారా..? అవుననే సమాధానం ఎక్కువగా వినపడుతోంది. కూకట్ పల్లి  టీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో పర్యటించారు.

శ్రీకాకుళం వచ్చిన ఆయనకు వైసీపీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. కాగా.. మాధవరం కృష్ణారావు వైసీపీ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొనాడానికే వచ్చారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

మరో నెల రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయన్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో వైసీపీకి తెలంగాణలో అధికార పార్టీ పూర్తి మద్దతుగా నిలుస్తున్న విషయం బహిరంగ సత్యం. ఈ నేపథ్యంలో మాధవరం కృష్ణారావు ఏపీకి వచ్చారనే వాదనలు వినపడుతున్నాయి.