బీజేపీ మహిళా నేత పురందేశ్వరికి కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆమె విశాఖపట్నం బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన సంగతి తెలిసిందే. అయితే... ఆమె అభ్యర్థిత్వంపై  వెళ్లనున్నట్లు తెలుగుశక్తి అధ్యక్షుడు బీవీ రామ్‌ తెలిపారు. 

సోమవారం సచివాలయంలో సీఈవోను కలిసిన తర్వాత ఆయన మాట్లాడుతూ, ‘‘పురందేశ్వరి ఎయిర్‌ ఇండియా డైరెక్టర్‌గా ఉన్నారు. ఆ పోస్టుకు రాజీనామా చేయకుండా ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆమె అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలని సీఈవోకు విజ్ఞప్తి చేశాం. భీమిలి వైసీపీ అభ్యర్థి ముత్తంశెట్టి శ్రీనివాసరావు గత ఎన్నికల్లో తాను ఏమీ చదువుకోలేదని అఫిడవిట్‌లో రాశారు. ఈ ఎన్నికల్లో డిగ్రీ చదువుకున్నట్లు పేర్కొన్నారు. దీనిపై మార్చి 3నే ఫిర్యాదు చేశాం. విచారించి చర్యలు తీసుకోవాల్సిన ఈసీ, ఎన్నికలు పూర్తయిన తర్వాత తామేమీ చేయలేమని, కోర్టును ఆశ్రయించమని సూచించింది. పురందేశ్వరి, ముత్తంశెట్టితోపాటు ఈసీపైనా కోర్టుకెళ్తాం’ అని రామ్‌ అన్నారు.