టిఎన్ఎస్ఎప్ అధ్యక్షుడు తిరుమలనాయుడిపై దాడిని నిరసిస్తూ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కార్యాలయం ఎదుట సోమవారం నాడు ధర్నాకు దిగారు

నెల్లూరు: టిఎన్ఎస్ఎప్ అధ్యక్షుడు తిరుమలనాయుడిపై దాడిని నిరసిస్తూ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కార్యాలయం ఎదుట సోమవారం నాడు ధర్నాకు దిగారు. దీంతో నెల్లూరులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

టీఎన్ఎస్ఎప్ అధ్యక్షుడు తిరుమలనాయుడిపై ఆదివారంనాడు వైసీపీ వర్గీయులు దాడి చేశారని ఆయన ఆరోపిస్తున్నారు. సోమవారం నాడు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే, వైసీపీ నేత కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కార్యాలయం ముందు ఆయన భార్య, కుటుంబసభ్యులు ధర్నా చేశారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.

అయితే తిరుమలనాయుడిపై దాడికి తనకు ఎలాంటి సంబంధం లేదని ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి వివరణ ఇచ్చారు. అంతేకాదు తన కార్యాలయంపై టీడీపీ కార్యకర్తలు దాడికి దిగారని కూడ ఆయన ఆరోపించారు. 

తిరుమలనాయుడికి అనేక మంది శత్రువులు ఉన్నారని... ఆయనపై ఎవరో దాడి చేస్తే ఆ దాడిని తనకు ఆపాదించడం సరైంది కాదని శ్రీధర్ రెడ్డి వివరణ ఇచ్చారు.తిరుమలనాయుడిపై దాడిని నిరసిస్తూ సోమవారం నాడు టీడీపీ కార్యకర్తలు నిరసన ప్రదర్శనలు చేశారు.

సంబంధిత వార్తలు

నెల్లూరులో టీడీపీ నేతపై రాళ్ల దాడి