కాకినాడ: రామచంద్రాపురం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి తోట త్రిమూర్తులు ఘోర పారాజయం పాలయ్యారు. ఇప్పటి వరకు రామచంద్రపురం నియోజకవర్గం నుంచి నాలుగుసార్లు గెలుపొందిన తోట త్రిమూర్తులు 2019 ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ చేతిలో పరాజయం పాలయ్యారు. 

సమీప ప్రత్యర్థి, వైసీపీ అభ్యర్థి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ తోట త్రిమూర్తులుపై 6,253 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. రామచంద్రాపురం నియోజకవర్గం నుంచి తోట త్రిమూర్తులు భారీ విజయం సాధిస్తారని టీడీపీ భావించింది. 

అయితే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేవ్ లో ఆశలన్నీ ఆడియాశలుగా మిగిలిపోయాయి. ఇకపోతే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ స్థానిక నేత కాకపోయినప్పటికీ గెలుపొందడం నియోజకవర్గంలో ఆసక్తికర చర్చ జరుగుతుంది.