కాకినాడ: టీడీపీకి తోట నరసింహం ఫ్యామిలీ  సోమవారం నాడు గుడ్‌ బై చెప్పింది. రెండు రోజుల్లో  తోట నరసింహం ఫ్యామిలీ వైసీపీలో చేరనుంది. తోట నరసింహం భార్య వాణి ఆదివారం నాడు ఏపీ సీఎం చంద్రబాబునాయుడుతో సమావేశమైన విషయం తెలిసిందే.

కాకినాడ ఎంపీ తోట నరసింహాం ఈ దఫా ెంపీ స్థానానికి పోటీ చేయబోనని ప్రకటించారు. అయితే  తనకు బదులుగా తన భార్య వాణికి జగ్గంపేట అసెంబ్లీ టిక్కెట్టును ఇవ్వాలని  ఆయన చంద్రబాబునాయుడును కోరారు. జగ్గంపేట సిట్టింగ్ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రుకే బాబు టిక్కెట్టును ఫైనల్ చేశారు.

ఈ తరుణంలో వాణి ఆదివారం నాడు బాబుతో సమావేశమయ్యారు. టిక్కెట్టుపై చంద్రబాబునాయుడు నుండి స్పష్టత రాని క్రమంలోనే తోట నరసింహాం కుటుంబం టీడీపీకి గుడ్‌బై చెప్పినట్టు ప్రచారం సాగుతోంది.

రెండు రోజుల్లో తోట నరసింహం ఫ్యామిలీ వైసీపీలో చేరనున్నారు. కాకినాడ లేదా పెద్దాపురం అసెంబ్లీ స్థానాల నుండి తోట వాణి వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేసే అవకాశం ఉంది. 2014 ఎన్నికలకు ముందే తోట నరసింహం టీడీపీలో చేరారు. ఆ ఎన్నికల్లో ఆయన టీడీపీ అభ్యర్ధిగా కాకినాడ నుండి పోటీ చేసి విజయం సాధించారు.