అమరావతి: జగన్‌కు ఒక్క ఛాన్స్ ఎందుకు ఇవ్వాలో విజయమ్మ చెప్పాలని  టీడీపీ ఎమ్మెల్సీ బాబు రాజేంద్రప్రసాద్  డిమాండ్ చేశారు. 

శుక్రవారం నాడు ఆయన అమరావతిలో  మీడియాతో మాట్లాడారు. ఈసీని ప్రధానమంత్రి మోడీ ప్రభావితం  చేస్తున్నారని ఆరోపించారు. ఐపీఎస్‌ల బదిలీలపైహైకోర్టు ఇచ్చిన తీర్పు ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాలేదన్నారు. 

ఈసీకి  కానీ, వైసీపీకి కానీ అనుకూలంగా తీర్పు రాలేదన్నారు.  రాజ్యాంగపరమైన ధర్మ సందేహం నెలకొన్న సమయంలో కోర్టుకు వెళ్లినట్టుగా చెప్పారు.సీఈసీ తీసుకొన్న నిర్ణయంపై  ఎన్నికలు జరిగే తరుణంలో తాము జోక్యం చేసుకోలేమని హైకోర్టు చెప్పిందని ఆయన తెలిపారు.

 ఐపీఎస్ అధికారుల బదిలీలు కరెక్టేనని కూడ కోర్టు చెప్పలేదని ఆయన గుర్తు చేశారు.  రాష్ట్ర ప్రభుత్వం వేసిన పిటిషన్‌ తప్పని కూడ కోర్టు చెప్పలేదన్నారు. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టును  ఆశ్రయించనున్నట్టు ఆయన తెలిపారు.