అమరావతి: వైఎస్ జగన్ పై మండిపడ్డారు టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్. రాజకీయాల్లో తన తాతకు అంత ఉంది తన తండ్రికి ఇంత ఉంది అంటూ గొప్పలు చెప్పుకునే జగన్ ప్రత్యేక హోదాపై ఎందుకు మోదీని నిలదియ్యలేకపోతున్నారో చెప్పాలని ప్రశ్నించారు. 

కానిస్టేబుల్ కొడుకునంటూ వచ్చి మోదీని గట్టిగా నిలదీసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అని స్పష్టం చేశారు. అంతేకాదు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను సైతం తిట్టిన ధైర్యవంతుడు అంటూ ప్రశంసలు గురిపించారు. 

తెలంగాణ ఏమైనా పాకిస్థానా అంటూ కేసీఆర్ పై విమర్శలు గుప్పిస్తుంటే రాజకీయాల్లో ఉద్దండునని చెప్పుకునే జగన్ కేసీఆర్ ను ఒక్కమాటైనా అన్నారా అంటూ విరుచుకుపడ్డారు. ప్రత్యేక హోదా, పునర్విభజన చట్టంలోని 18 అంశాలపై ఎందుకు మోదీని నిలదియ్యడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. 

పవన్ కళ్యాణ్ కు ఉన్న దమ్ము ధైర్యం కూడా లేని వ్యక్తి జగన్ అంటూ మండిపడ్డారు. ఆయన అవినీతికి కేరాఫ్ అడ్రస్ మాత్రమేనని చెప్పుకొచ్చారు. కేసీఆర్, మోదీలతో ఉన్న బంధం కారణంగానే వారిపై జగన్ విమర్శలు చెయ్యడం లేదని రాజేంద్రప్రసాద్ స్పష్టం చేశారు.