వైఎస్ జగన్, ఆయన కుటుంబంపై టీడీపీ నేత రాజేంద్రప్రసాద్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.  శనివారం మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. జగన్ తో పాటు ఆయన కుటుంబసభ్యులపై కూడా సంచలన ఆరోపణలు చేశారు.

వైఎస్ ఒక హంతకుడు అని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. జగన్, ఆయన తాత, తండ్రి హత్యా రాజకీయాలు చేశారని తీవ్ర ఆరోపణలు చేశారు. పరిటాల రవిని చంపించిన నేర చరిత్ర వైఎస్‌ది అని అన్నారు. వైఎస్ అరాచకాలు చూడలేకనే పంచభూతాలు ఆయన్ని తీసుకెళ్లాయని తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. 

జగన్ వ్యాఖ్యలు దొంగే దొంగ అన్నట్లుగా ఉన్నాయని మండిపడ్డారు. శనివారం ఎన్నికల ప్రచారంలో మాట్లాడిన ఆయన.. టీడీపీ నాయకులకు ఎలాంటి నేర చరిత్ర లేదన్నారు. చంద్రబాబుకు ఓటేస్తే పసుపు-కుంకుమ ఇస్తారని, జగన్‌కు ఓటేస్తే.. పసుపు-కుంకుమ చెరిపేస్తారని వ్యాఖ్యానించారు.

అనంతరం మోహన్ బాబుపై కూడా రాజేంద్ర ప్రసాద్ మండిపడ్డారు. మోహన్ బాబు రాజకీయ డ్రామాలాడుతున్నారని దుయ్యబట్టారు. అమాయక విద్యార్థులను తీసుకువచ్చి ధర్నా చేయించారని ఆరోపించారు.  మోహన్ బాబు సిల్లీగా గల్లీ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.