వైసీపీ నేతలు రాక్షసానందం పొందుతున్నారని టీడీపీ నేత లంకా దినకర్ అన్నారు. మంగళవారం ఏపీ రాజధాని అమరాతి లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఏపీ విషయంలో ఎన్నికల  సంఘం వ్యవహరిస్తున్న తీరుపై ఆయన మండిపడ్డారు.

దేశ మొత్తం ఒకలాగా... ఏపీలో మాత్రం ఇంకోలాగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ప్రజలకు అందించే సంక్షేమ పథకాలు ఆపాలని ఏ ఎన్నికల కోడ్ లో లేదని ఆయన పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు  ఇబ్బంది కలగకుండా సమీక్షలు చేసే అధికారం ముఖ్యమంత్రికి ఉంటుందనది చెప్పారు.

ప్రజలకు సంక్షేమ పథకాలు అందకుండా చేయడంలో వైసీపీ నేతలు పాత్ర పోషించారని.. వాటిని అడ్డుకొని వైసీపీ నేతలు రాక్షసానందం పొందుతున్నారని ఆరోపించారు.