అమరావతి: ఏపీలో బీజేపీ అభ్యర్థులకు బంపర్ ఆఫర్లు ప్రకటించారు ఏపీ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు. రాబోయే ఎన్నికల్లో ఏపీలో బీజేపీ అభ్యర్థులకు డిపాజిట్లు వస్తే తన సొంత డబ్బు నుంచి రూ.5లక్షలు ఇస్తానని ఆఫర్ ప్రకటించారు. 

అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణకు డిపాజిట్ వస్తే రూ.10 లక్షలు ఇస్తానని మరో ఆఫర్ ఇచ్చారు కుటుంబంరావు. బీజేపీ నుంచి ఒక్క ఎమ్మెల్యే గెలిచినా రూ.15 లక్షలిస్తానని ప్రకటించారు. 

ఈ నగదు అంతా తన సొంత సొమ్ముగా ఇస్తానని స్పష్టం చేశారు. ఏపీలో బీజేపీ పూర్తిగా చచ్చిపోయిందని ప్రస్తుతం బీజేపీ కంటే ప్రజాశాంతి పార్టీకే ఎక్కువ సీట్లు వస్తాయని చెప్పారు. కుటుంబరావు ఆఫర్లపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.