ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. రేపు ఉదయం 8గంటలకు ఎన్నికల ఫలితాల కౌంటింగ్ ప్రారంభం కానుంది. కాగా.. కౌంటింగ్ జరిగే ప్రాంతాల్లో అల్లర్లు సృష్టించడానికి వైసీపీ నేతలు ప్లాన్ వేస్తున్నారని సీని నటి, టీడీపీ మహిళా నేత దివ్య వాణి ఆరోపించారు.

వైసీపీ అరాచకాలను ప్లాన్ ప్రకారం టీడీపీపై రుద్దాలనుకుంటున్నారని ఆమె అన్నారు. పోలీసులు ముందుగా మేల్కొని కౌంటింగ్ రోజు వైసీపీ నేతలు ఎలాంటి అల్లర్లు సృష్టించకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఓటమి భయంతో వైసీపీ మైండ్‌గేమ్ ఆడుతుందన్నారు. 

కోటిమంది మహిళలు, 70 లక్షల మంది రైతులు చంద్రబాబు పక్షాన నిలిచారన్నారు. క్విడ్‌ప్రోకో ద్వారా జగన్ రాష్ట్ర పరువుతీశారన్నారు. అలాగే కేసులు మాఫీ చేసుకోవడానికి పక్కరాష్ట్రం సీఎం ముందు ఏపీ పరువును తాకట్టు పెట్టారని విమర్శించారు.