Asianet News TeluguAsianet News Telugu

టీడీపీ తొలి జాబితాలో వారసులకు టిక్కెట్ల పంట

అసెంబ్లీ ఎన్నికలకు గాను తెలుగుదేశం పార్టీ 126 మందితో గురువారం రాత్రి తొలి జాబితా ప్రకటించింది. ఈ క్రమంలో సీనియర్లు, మంత్రుల కోరిక మేరకు జాబితాలో వారి వారసులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టిక్కెట్లు కేటాయించారు. 

tdp chief chandrababu given chances to youth leaders in first list
Author
Amaravathi, First Published Mar 15, 2019, 9:21 AM IST

అసెంబ్లీ ఎన్నికలకు గాను తెలుగుదేశం పార్టీ 126 మందితో గురువారం రాత్రి తొలి జాబితా ప్రకటించింది. ఈ క్రమంలో సీనియర్లు, మంత్రుల కోరిక మేరకు జాబితాలో వారి వారసులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టిక్కెట్లు కేటాయించారు.

వయసు, ఆరోగ్యం, వ్యక్తిగత కారణాలతో ఈసారి తమ వారసులకు టిక్కెట్లు ఇవ్వాలంటూ పలువరు సీనియర్ నేతలు, మంత్రులు విజ్ఞప్తి చేయడంతో యువతకు అవకాశం కల్పించారు. డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి కుమారు కేఈ శ్యాంబాబు, మంత్రి పరిటాల సునీత కుమారుడు శ్రీరాం, మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డి

సీనియర్ నేత గౌతు శివాజీ కుమార్తె శిరీష, జలీల్‌ఖాన్ కుమార్తె షబానా ఖాతూన్, కిడారి సర్వేశ్వరరావు కుమారుడు కిడారి శ్రావణ్ కుమార్, గాలి మద్దుకృష్ణమ నాయుడు తనయుడు భానుప్రకాశ్, మంత్రి కిమిడి మృణాళిని కుమారుడు నాగార్జున, దేవినేని నెహ్రూ కుమారుడు దేవినేని అవినాశ్, ఎర్రన్నాయుడు కుమార్తె భవానిలకు తొలి విడతలో చంద్రబాబు టికెట్లు కేటాయించారు. రెండో విడతలో మరికొందరికి టిక్కెట్లు కేటాయించే అవకాశాలున్నాయని టీడీపీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios