చెవిరెడ్డికి టీడీపీ అభ్యర్థి భార్య సవాల్ విసిరింది. ఎవరెన్ని డ్రామాలు ఆడినా చంద్రగిరి నియోజకవర్గంలో టీడీపీ గెలుపు ఖాయమని ఆ పార్టీ అభ్యర్థి పులివర్తి నాని సతీమణి సుధారెడ్డి అన్నారు. రీపోలింగ్ జరుగుతున్న పులివర్తివారిపల్లిలో ఆమె ఇంటింటా ప్రచారం నిర్వహించారు. 

ఓటమి భయంతోనే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి టీడీపీకి కంచుకోటగా ఉన్న ప్రాంతాల్లో రీపోలింగ్ నిర్వహించడానికి అడ్డదారులు తొక్కుతున్నారని ఆరోపించారు. పోలింగ్ జరిగిన మరుసటి రోజే తాము 25 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ జరపాలని ఈసీని కోరినా స్పందించలేదని విమర్శించారు. కానీ నిన్నగాక మొన్న చెవిరెడ్డి ఫిర్యాదు చేస్తే స్పందించడమేంటి? అని నిలదీశారు. 

నియోజకవర్గం పరిధిలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లోనూ రీపోలింగ్‌కు తాము సిద్ధమని.. అందుకు చెవిరెడ్డి సిద్ధమేనా? అంటూ ఆమె సవాల్ విసిరారు.