విజయనగరం:  
విజయనగరం జిల్లా కురుపాం టీడీపీ అభ్యర్థి జనార్థన్ థాట్రాజ్ కు షాక్ తగిలింది. జనార్థన్ థాట్రాజ్ నామినేషన్ ను తిరస్కరించారు ఎన్నికల రిటర్నింగ్ అధికారి.  నామినేషన్ లో భాగంగా ఎన్నికల 
అఫిడివిట్ లో దాఖలు చేసిన కుల ధ్రువీకరణ పత్రం పై బీజేపీ అభ్యర్థి నిమ్మక జయరాజు అభ్యంతరం వ్యక్తం చేశారు. 

తప్పుడు కుల ధ్రువీకరణ పత్రాన్నే నామినేషన్ లో పొందు పరిచారంటూ ఆరోపించారు. 2013లో జారీ చేసిన కుల ధృవీకరణ పత్రం ఆధారంగా ఎలా నామినేషన్ ను అంగీకరిస్తారని ప్రశ్నించారు. 

జనార్థన్ థాట్రాజ్ ఎస్టీ కాదని 2012లో ఏపీ హైకోర్టు తీర్పునిచ్చిందని బీజేపీ అభ్యర్థి నిమ్మక జయరాజు ఆధారాలు చూపించారు. అలాగే 2014లో కూడా సుప్రీం కోర్టు జనార్థన్ థాట్రాజ్ ఎస్టీ కాదని స్పష్టం చేసిన పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అందజేశారు నిమ్మక జయరాజు. 

దీంతో జనార్థన్ థాట్రాజ్ కుల ధృవీకరణ పత్రాన్ని పరిశీలించిన రిటర్నింగ్ అధికారి తప్పులు ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఆయన నామినేషన్ ను తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు. జనార్థన్ థాట్రాజ్ నామినేషన్ తిరస్కరణకు గురవ్వడంతో ఆయన తల్లి నర్సింహా ప్రియా థాట్రాజ్ బరిలో ఉన్నారు. ఆమె నామినేషన్ దాఖలు  దాంతో  నిర్ధారించిన ఎన్నికల అధికారి.

పోటీలో ఉన్న జనార్దన్ థాట్రాజ్ తల్లి నర్సింహా ప్రియా థాట్రాజ్.