చిత్తూరు:చిత్తూరు జిల్లా పూతలపట్టు అసెంబ్లీ స్థానంలో పోటీ చేసే అభ్యర్ధిని టీడీపీ మార్చింది.  బుధవారం నుండి ఆచూకీ లేకుండా పోయిన పూర్ణం స్థానంలో లలితా థామస్‌ను టీడీపీ బరిలోకి దింపుతోంది.

పూతలపట్టు అసెంబ్లీ స్థానంలో పూర్ణంకు టీడీపీ టిక్కెట్టు కేటాయించింది.అయితే  నిన్నటి నుండి పూర్ణం కన్పించకుండా పోయాడు. గురువారం నాడు  ఉదయం టీడీపీ కార్యాలయంలో ప్రత్యక్షమయ్యాడు. 

తనకు ఆరోగ్యం బాగా లేనందున చికిత్స కోసం వెళ్తే తనపై తప్పుడు ప్రచారం చేశారని పూర్ణం గురువారం నాడు ప్రకటించారు. పూర్ణం అభ్యర్థిత్వాన్ని స్తానిక టీడీపీ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీంతో పూర్ణం స్థానంలో లలితా థామస్‌ను టీడీపీ గురువారం నాడు ప్రకటించింది. మరోవైపు దర్శి అసెంబ్లీ స్థానంలో కదిరి బాబురావును కొనసాగించాలని  టీడీపీ నిర్ణయం తీసుకొంది.