విజయవాడ: టీడీపీ అధికార ప్రతినిధి సాధినేని యామినిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, విజయవాడ మాజీ మేయర్ తాడి శకుంతల విరుచుకుపడ్డారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి, ఆయన కుటుంబంపై విమర్శలు చేసే స్థాయి నీకు లేదన్నారు. 

యామినీ నువ్వు ఏదో ఊహించుకుని కామెంట్లు చేస్తున్నావని నీకంత సీన్ లేదన్నారు. స్థాయి మరిచి మాట్లాడితే బాగోదని హెచ్చరించారు. వైఎస్ కుటుంబాన్ని ప్రశ్నించే అర్హత నీకు లేదన్నారు. టీడీపీలో ఉన్న మీరంతా వలస పక్షులేనని గుర్తు చేశారు.

 వైఎస్ జగన్ పెంపకంపై యామినీ మాడ్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. నెల జీతానికి పనిచేసే యామినీ వైఎస్‌ కుటుంబంపై వ్యాఖ్యలు చేయడం ఆమె తెలివి తేటలకు నిదర్శనమన్నారు. 

తేడా నేతలు అంటే నందమూరి బాలకృష్ణ, నారా లోకేష్ అని రాష్ట్ర ప్రజలందరికీ తెలుసన్నారు. వైఎస్ కుటుంబం ప్రజలతో ఎలా మమేకమయ్యిందో తెలుసుకోవాలని స్థాయికి తగ్గట్లుగా విమర్శలు చేస్తే మంచిదని తాడి శకుంతల వార్నింగ్ ఇచ్చారు.