కర్నూలు: కర్నూలు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగిలింది. మంత్రి భూమా అఖిలప్రియకు మేనమామ ఎస్వీ జగన్మోహన్ రెడ్డి ఊహించని రీతిలో ట్విస్ట్ ఇచ్చారు. ఆళ్లగడ్డకు చెందిన ఎస్వీ జగన్‌మోహన్ రెడ్డి శనివారం లోటస్‌పాండ్‌లో వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సమక్షంలో వైసీపీ కండువా 

వైఎస్ జగన్ ఆయకు పార్టీ కండువా కప్పి స్వాగతించారు. గత కొంతకాలంగా తెలుగుదేశం పార్టీపై అసంతృప్తితో రగిలిపోతున్న ఆయన టీడీపీకి రాజీనామా చేశారు. వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 

మేనమామ ఎస్వీ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ట్విస్ట్ తో షాక్ కు గురైన మంత్రి భూమా అఖిలప్రియ మిగిలిన వారిని కాపాడుకునేందుకు రంగంలోకి దిగారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో భూమా కుటుంబానికి దశబ్దాల కాలంగా అండగా ఉన్న కుటుంబాలు పార్టీ వీడుతుండటంతో ఆమె బుజ్జగింపులకు దిగారని తెలుస్తోంది.