టీడీపీ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ కుమార్తె షబానా  నామినేషన్‌పై ఇప్పుడు  గందరగోళం నెలకొంది. ఆమెకు ఉన్న  అమెరికా గ్రీన్ కార్డ్ రద్దు కాకపోవడంతో షబానా నామినేషన్‌పై టీడీపీ నేతలు డైలమాలో పడిపోయారు. గ్రీన్ కార్డు రద్దు కోసం టీడీపీ అభ్యర్థి షబానా ఇన్ని రోజులు నామినేషన్ వేయకుండా ఉన్నారు. షబానా నామినేషన్ చెల్లకపోతే ఎవరికి సీటివ్వాలన్న ఆలోచనలో టీడీపీ పడింది. జలీల్ ఖాన్, నాగూల్ మీరాల పేర్లను టీడీపీ అధిష్టానం పరిశీలిస్తోంది. 

నామినేషన్లకు సోమవారం ఆఖరి తేదీ కావడంతో టీడీపీలో ఆందోళన నెలకొంది. జలీల్‌ఖాన్ అమెరికాలో ఉన్న కుమార్తెను ఇటీవలే ఇండియాకు వచ్చారు.  అయితే అమెరికా ప్రభుత్వం నిర్ణయించిన కాలం పాటు అక్కడ ఉన్న వారికి గ్రీన్‌ కార్డు మంజూరు చేస్తుంది.

ఈ కార్డు పొందినవారు ఒక రకంగా అమెరికా పౌరులుగానే పరిగణింపబడతారు. ప్రస్తుతం షబానా సైతం గ్రీన్‌ కార్డు పొంది ఉన్నారు. దీంతో నామినేషన్‌ విషయంలో చిక్కులు ఎదురయ్యాయి. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా షబానా సీటు దక్కించుకున్న విషయం తెలిసిందే.