అమరావతి: అధికార తెలుగుదేశం పార్టీకి కర్నూలు జిల్లాలో మరో షాక్ తగిలింది. టీడీపీ ఎంపీ ఎస్పీ వై రెడ్డి ఆ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. అనంతరం కుమార్తె సుజలతో  కలిసి జనసేన పార్టీలో చేరిపోయారు. 

ఎస్పీవై రెడ్డి, సుజలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ కండువాకప్పి సాదరంగా ఆహ్వానించారు. అనారోగ్యం కారణంగా తాను రాబోయే ఎన్నికల్లో పోటీ చెయ్యలేనని తన కుమార్తె సుజలకు నంద్యాల ఎంపీ టికెట్ ఇవ్వాలని చంద్రబాబు ను కోరారు ఎస్పీ వైరెడ్డి. 

అయితే టికెట్ ఇచ్చేందుకు చంద్రబాబు నాయుడు నిరాకరించారు. ఆ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా మాండ్ర శివానందరెడ్డిని బరిలోకి దించారు. దీంతో ఆయన అలకబూనారు. దాదాపు పార్టీకి గుడ్ బై చెప్పి ఇండిపెండెంట్ గా పోటీ చెయ్యాలని నిర్ణయించుచకున్నారు. 

అనూహ్యంగా జనసేన పార్టీలో చేరిపోయారు ఎస్పీ వైరెడ్డి. ఇకపోతే ఎస్పీ వైరెడ్డి 2014 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నంద్యాల పార్లమెంట్  కు పోటీ చేసి గెలుపొందారు. అనంతరం నంద్యాల అభివృద్ధి పేరుతో ఆయన టీడీపీలో చేరిపోయారు.