అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  ఓట్ల తొలగింపు కోసం ఫారం-7 దరఖాస్తుల దుర్వినియోగంపై ఏర్పాటు చేసిన సిట్  శుక్రవారం నాడు పనిని ప్రారంభించింది.  ఏపీ ఫైర్ సర్వీసెస్ డీజీపీ సత్యనారాయణ నేతృత్వంలో ఈ సిట్ ఏర్పాటైన విషయం తెలిసిందే.

ఏపీ రాష్ట్రంలోని 13 జిల్లాల నుండి  ఒక్కో డీఎస్పీ స్థాయి అధికారిని ఈ బృందంలో నియమించారు.  ఓట్ల తొలగింపునకు సంబంధించి ఏర్పాటు చేసిన సిట్ ఇంచార్జీ సత్యనారాయణ శుక్రవారం నాడు ఏపీ డీజీపీ ఠాకూర్‌తో సమావేశమయ్యారు.

ఫారం-7 దుర్వినియోగంపై ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన కేసుల వివరాలను, కేసు దర్యాప్తు వివరాల గురించి తెలుసుకొన్నారు అయితే ఈ కేసును బృందాలుగా విడిపోయి దర్యాప్తు చేయాలని సిట్ భావిస్తోంది.

రాష్ట్రంలో సుమారు 8 లక్షలకు పైగా ఓట్లను తొలగించాలని కోరుతూ పారం -7 దరఖాస్తులు చేశారు. అయితే ఈ విషయమై క్షేత్రస్థాయి పరిశీలన చేయనున్నారు. ఈ దరఖాస్తుల్లో ఎక్కువగా నకిలీవేనని ఆరోపణలు కూడ ఉన్నాయి.ఈ దరఖాస్తులపై ఇప్పటికే 350 కేసులు నమోదయ్యాయి. ఇందులో 232 కేసులకు సంబంధించి 2300 దరఖాస్తులు వచ్చిన విషయాన్ని కూడ సిట్ బృందం గుర్తించింది.