ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ శ్రీకాకుళంలో నిర్వహించిన సభలో అపశృతి చోటు చేసుకుంది. ప్రజలనుద్దేశించి పవన్ ప్రసంగిస్తుంగా వాహనం నుంచి పొగలు వచ్చాయి.

వెంటనే అప్రమత్తమైన ఆయన వాహనం దిగి తన ప్రసంగాన్ని కొనసాగించారు. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి హానీ జరగకపోవడంతో పోలీసులు, జనసేన కార్యకర్తలు ఊపిరి పీల్చుకున్నారు. కాగా, ఇంజిన్‌ వేడెక్కడం వల్లే షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ పొగలు వచ్చినట్లుగా తెలుస్తోంది.