ఆంధ్రప్రదేశ్ ఏసీబీ డీజీగా ఎస్.బి బాగ్చీని నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఆయన ఏసీబీ డైరెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు

ఆంధ్రప్రదేశ్ ఏసీబీ డీజీగా ఎస్.బి బాగ్చీని నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఆయన ఏసీబీ డైరెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈసీతో ఏపీ డీజేపీ ఆర్‌.పీ.ఠాకూర్ భేటీ అయిన తర్వాత ఈ నిర్ణయం వెలువడటం విశేషం.

ఇప్పటి వరకు రాష్ట్ర డీజీపీతో పాటు ఏసీబీ డీజీగా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు ఆర్‌పీ ఠాకూర్. వైసీపీ, బీజేపీ ఫిర్యాదు మేరకు ఇప్పటికే ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులను ఎన్నికల సంఘం విధుల నుంచి తప్పించిన సంగతి తెలిసిందే.