ప్రస్తుతం ఏపీలో ఎన్నికల వేడి ఏవిధంగా ఉందో.. లక్ష్మీఎన్టీఆర్ సినిమా ప్రకంపనలు కూడా అదే రేంజ్ లో ఉన్నాయి. సినిమాని ఎలాగైనా విడుదల చేయాలని సినీ దర్శకుడు ఆర్జీవీ, వైసీపీ నేతలు చూస్తుంటే.. సినిమా విడుదలను అడ్డుకోవాలని టీడీపీ నేతలు చూస్తున్నారు. కాగా.. తాజాగా.. ఆర్జీవీ చేసిన ట్వీట్ ఇప్పుడు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

లక్ష్మీఎస్ ఎన్టీయార్ కి ముందు బాలకృష్ణ లీడ్ రోల్ లో ఎన్టీఆర్ బయోపిక్ తెరకెక్కించిన సంగతి తెలిసిందే. కథానాయకుడు, మహానాయకుడు పేరిట వీటిని విడుదల చేశారు. కాగా.. ఈ రెండు సినిమాలు పెద్దగా ప్రజలను ఆకట్టుకోలేదు. ఈ విషయాన్ని పక్కనపెడితే.. ఇందులో కథానాయకుడిలో ఓ సీన్  ఎన్టీఆర్ పాత్రధారి బాలయ్య చెప్పిన డైలాగ్ ని ఇప్పుడు వర్మ తన సినిమా ప్రమోషన్ కి వాడుకుంటున్నాడు.

ఎమర్జెన్సీ సమయంలో సినిమాని విడుదల చేయవద్దని అప్పటి ప్రభుత్వం చెప్పినా వినకుండా.. ఎన్టీఆర్ సినిమా విడుదల చేస్తారు. ఆ సమయంలో బాలయ్య సూత్రధారి సినిమాని ఏ ఎమర్జెన్సీ అడ్డుకోలేదంటూ డైలాగ్ చెబుతారు. కాగా ఆ డైలాగ్ ని తన తెలుగు సినిమా ట్విట్టర్ లో పోస్టు చేయగా.. దానిని ఆర్జీవీ రీట్వీట్ చేశారు.

ప్రస్తుతం లక్ష్మీఎస్ ఎన్టీఆర్ సినిమాని అడ్డుకోవాలనే ప్రయత్నాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. ఈ ట్వీట్ తో ఏపీ ప్రభుత్వానికి వర్మ సమాధానం  చెప్పాడనే వాదనలు వినపడుతున్నాయి.