సిమెంట్ బస్తాల కింద కోట్లు: పట్టుకున్న బెజవాడ పోలీసులు

First Published 10, Apr 2019, 1:19 PM IST
Rs.1.98 crores cash seized in vijayawada
Highlights

పోలింగ్‌కు ఇంకొద్ది గంటలే సమయం ఉన్నప్పటికీ పార్టీలు ఓటర్లను ప్రలోభపెట్టే ప్రయత్నాలను ముమ్మరంగా సాగిస్తున్నాయి. డబ్బు, మద్యంతో పాటు ఇతరత్రా మార్గాలను పార్టీలు అన్వేషిస్తున్నాయి

పోలింగ్‌కు ఇంకొద్ది గంటలే సమయం ఉన్నప్పటికీ పార్టీలు ఓటర్లను ప్రలోభపెట్టే ప్రయత్నాలను ముమ్మరంగా సాగిస్తున్నాయి. డబ్బు, మద్యంతో పాటు ఇతరత్రా మార్గాలను పార్టీలు అన్వేషిస్తున్నాయి.

వీటికి అడ్డుకట్ట వేసేందుకు ఎన్నికల సంఘం ఎన్ని కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినప్పటికీ ఆయా పార్టీలు మాత్రం దొడ్డిదారిన డబ్బు తరలిస్తూనే ఉన్నాయి. కృష్ణాజిల్లా విజయవాడలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా.. లారీలో తరలిస్తున్న రూ.కోటీ 98 లక్షల నగదు బయటపడింది.

సిమెంట్ బస్తాల లారీలో డబ్బును దాడి తరలించేందుకు ఓ అభ్యర్థి ప్రయత్నించినట్లు తెలిసింది. పక్కా సమాచారంతో చాకచక్యంగా వ్యవహరించిన విజయవాడ పోలీసులు తాడిగడప వంద అడుగుల రోడ్డులో తనిఖీలు చేపట్టి నగదు తరలింపును అడ్డుకున్నారు.

లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ నగదు ఎవరిది..? అనే వివరాలు తెలియాల్సి ఉంది. పోలింగ్‌కు కొన్ని గంటల ముందు ఇంత మొత్తంలో నగదు లభించడం కలకలం రేపింది. 

loader