చిత్తూరు: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ రోజా ఘన విజయం సాధించారు. నగరి నియోజకవర్గం నుంచి రెండోసారి పోటీ చేసి గెలుపొందారు. తన సమీప ప్రత్యర్థి దివంగత నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు తనయుడు గాలి భాను ప్రకాష్ పై 2వేల 681 ఓట్ల మెజారిటీతో ఆమె గెలుపొందారు. 

రోజా గెలుపుపై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయినప్పటికీ రోజామాత్రం తనదే గెలుపు అంటూ ధీమా వ్యక్తం చేశారు. రోజా ఆశించినట్లే ఆమె భారీ విజయం సాధించారు. ఇకపోతే రోజా గెలుపొందడం, జగన్ సీఎం కావడంతో ఆమె జగన్ కేబినేట్ లో కీలక పోస్టులో ఉంటారంటూ ప్రచారం జరుగుతుంది. 

రోజా కాబోయే హోం మంత్రి అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో రోజా జగన్ కేబినేట్ లో ఉండటం ఖాయమనే వాదనలు వినిపిస్తున్నాయి. మరి రోజా మంత్రి అవుతారా లేదా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.