సంచలన వివాదాస్పద దర్శకుడు తెరకెక్కించిన తాజా చిత్రం లక్ష్మీఎస్ ఎన్టీఆర్. ఎన్టీఆర్  జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా విడుదలను ఏపీ ప్రభుత్వం అడ్డుకుంటోంది. ఆ సినిమాలో చంద్రబాబుని నెగిటివ్ గా చూపించారనేది వారి వాదన. కాగా.. సినిమాని అడ్డుకోవడం పట్ల రామ్ గోపాల్ వర్మ.. ట్విట్టర్ వేదికగా మండిపడుతున్నాడు. తనదైన శైలీలో చంద్రబాబుపై విమర్శలు చేస్తున్నారు.

చంద్రబాబు పేరు ప్రస్తావించకుండా పరోక్షంగా ఆయన ఎన్నికల్లో ఓడిపోవాలంటూ వర్మ ట్వీట్లు చేశారు. ‘‘సినిమా కోసం పుట్టి, సినిమా మూలంగా సీఎం అయిన మహానాయకుడు ఎలా సీఎం పదవి పోగొట్టుకున్నాడో అనే  సినిమా చూడకుండా ఆపుతున్న తెర వెనక ఉన్న  వెన్నుపోటు డైరెక్టర్ కి నాలాంటి కోట్ల ఎన్టీఆర్ అభిమానులందరం కమండలం లో నీళ్లు తీసి శపిస్తున్నాం ..ఈ ఎన్నికలలో ఓటమి ప్రాప్తించుగాక .. తధాస్తు’’ అంటూ ట్వీట్ చేశారు.

‘‘తెలుగు వాడి ఆత్మగౌరవం కోసం పార్టీ పెట్టిన అతి గొప్ప తెలుగువాడి మరణానికి దారి  తీసిన మానసిక క్షోభ రేపు తెలుగు వాళ్ళల్లో కొంత మందే  చూస్తుంటే ఇంకా ఎందరో కేవలం ఎదురు  చూసే పరిస్థితి కల్పించిన ఆ వెన్నుపోటుదారుడెవరో  ?.’’ అంటూ మరో ట్వీట్ చేశారు.

కాగా ఆర్జీవీ ట్వీట్లకు.. కొందరు పాజిటివ్ గా రెస్పాండ్ అవుతుంటే.. మరికొందరు మాత్రం వ్యతిరేకంగా పోస్టులు పెడుతుండటం గమనార్హం.