రాజమహేంద్ర వరం సిటీ టీడీపీ టికెట్ ని భవానీ అనే మహిళకు కేటాయించినట్లు ప్రచారం మొదలైంది. ఆమె తన కుటుంబంతో స్వహా.. చంద్రబాబు నివాసానికి వెళ్లి మరీ.. తన టికెట్ ని ఖరారు చేసుకున్నారట. ఇంతకీ ఎవరీ భవానీ.. ఈమెకు ఎందుకు టికెట్ ఇచ్చారు అని అనుకుంటున్నారా..? ఆమె కూడా రాజకీయ నేపథ్యంగల కుటుంబం నుంచే వచ్చింది. అందుకే ఆమెకు టికెట్ కేటాయించారు.

ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు.. కోడలే ఈ భవాని. అంతే కాదు ఎర్రన్నాయుడు కుమార్తె, శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు సోదరి కూడా. అందుకే వెంటనే టికెట్ కేటాయించేశారు.

ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు ఆయన కుమారుడు వాసు, కోడలు భవాని కలిసి అమరావతి వెళ్లి సోమవారం రాత్రి ముఖ్యమంత్రిని కలిశారు. పది గంటల సమయంలో వీరు సీఎంను కలిసి వచ్చారు. భవాని పేరును ఖరారు చేస్తున్నట్ల సీఎం తెలిపారని ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు నియోజకవర్గంలో ప్రచారం చేసుకుంటున్నారు. రెండు, మూడు రోజుల్లో  అధికారిక ప్రకటన రానుంది.