Asianet News TeluguAsianet News Telugu

ఎన్నికల వేళ ప్రకాశ జిల్లా ఎస్పీపై ఈసీ బదిలీ వేటు

వైసిపి నేతల ఫిర్యాదు నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కోయ ప్రవీణ్‌పై బదిలీ వేటు వేసింది. ఎన్నికలు మరికొద్ది గంటల్లో జరగనున్న నేపథ్యంలో సీఈసీ ఈ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది.

Prakasam dist SP transferred by EC
Author
Ongole, First Published Apr 9, 2019, 11:16 PM IST

ఒంగోలు: ప్రకాశం జిల్లా ఎస్పీ కోయ ప్రవీణ్‌పై కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంది. ఆయనను బదిలీ చేయాలని ఆదేశించింది. అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ ఆయనపై వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు. 

వైసిపి నేతల ఫిర్యాదు నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కోయ ప్రవీణ్‌పై బదిలీ వేటు వేసింది. ఎన్నికలు మరికొద్ది గంటల్లో జరగనున్న నేపథ్యంలో సీఈసీ ఈ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది.

 ప్రకాశం జిల్లా ఎస్పీ కోయ ప్రవీణ్‌తో పాటు మంగళగిరి, తాడేపల్లి సీఐలపై బదిలీ వేటు వేస్తూ ఈసీ ఆదేశాలు జారీ చేసింది. అధికార పార్టీకి కొందరు అధికారులు అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ గత నెల 25న  వైసిపిన నేతలు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. 

ఇప్పటికే ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు ఇంటెలిజెన్స్‌ డీజీ, కడప, శ్రీకాకుళం ఎస్పీలను ఈసీ బదిలీ చేసింది. ప్రవీణ్ స్థానంలో స్థానంలో సిద్ధార్ద్‌ కౌషిల్‌ను ప్రకాశం జిల్లా ఎస్పీగా నియమించింది. 

Follow Us:
Download App:
  • android
  • ios