జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై విరుచుకుపడ్డారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. సోమవారం తణుకులో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన పవన్ కల్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తే తాను అక్కడి నుచే బరిలోకి దిగుతానని ప్రకటించారు.

పవన్ పాలకొల్లు నుంచి పోటీ చేస్తే నేను అక్కడే పోటీ చేస్తానన్నారు. అసెంబ్లీ, పార్లమెంటు స్థానాల్లో ప్రజాశాంతి పార్టీ పోటీ చేస్తుందని పాల్ తెలిపారు. మంగళవారం సాయంత్రం తాను ఎక్కడి నుంచి పోటీ చేసేది ప్రకటిస్తానని తెలిపారు.

టికెట్ల కోసం తమ పార్టీకి 2000 మంది దరఖాస్తు చేసుకున్నారని కేఏ పాల్ వెల్లడించారు. అభ్యర్థుల జాబితాను ప్రకటించిన తర్వాత ఈ నెల 21, 22 తేదీలలో నామినేషన్లు వేస్తామన్నారు. తమ పార్టీకి రాష్ట్రంలో 79 సీట్లు వస్తాయని కేఏ పాల్ ఆశాభావం వ్యక్తం చేశారు.