వైఎస్ జగన్ సీఎం అయితే రాష్ట్రం రావణ కాష్టం అవుతోందని ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కె.ఏ. పాల్ అభిప్రాయపడ్డారు. చంద్రబాబునాయుడు మరోసారి సీఎం అయితే రాష్ట్రంలో అభివృద్ధి ఆగిపోయే అవకాశం ఉందన్నారు.


అమరావతి: వైఎస్ జగన్ సీఎం అయితే రాష్ట్రం రావణ కాష్టం అవుతోందని ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కె.ఏ. పాల్ అభిప్రాయపడ్డారు. చంద్రబాబునాయుడు మరోసారి సీఎం అయితే రాష్ట్రంలో అభివృద్ధి ఆగిపోయే అవకాశం ఉందన్నారు.

ఆదివారం నాడు ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడారు.గ్లాసు, ప్యాన్‌, సైకిల్‌కు ఎవరూ ఓటేయొద్దని కేఏ పాల్ కోరారు. మాయావతి మాయలో పవన్‌ కల్యాణ్‌ పడ్డారని, యూపీలో మాయావతి అవినీతిలో నెంబర్‌వన్ అని విమర్శించారు. పవన్‌కల్యాణ్‌కు మాయావతి ఎన్ని కోట్లు ఇచ్చారో చెప్పాలని పాల్ డిమాండ్ చేశారు.

వైసీపీ చీఫ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన గ్యాంగులు తనపై దాడికి ప్రయత్నించారని ఆయన ఆరోపించారు.ఈ విషయమై తాను పోలీసులకు ఫిర్యాదు చేసిన కూడ పట్టించుకోలేదని ఆయన ఆరోపించారు.

 తనపై దాడికి ప్రయత్నించిన వారిని అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఎన్నికలను వాయిదా వేయాలని ఈసీని కోరినట్టుగా ఆయన చెప్పారు. ఎన్నికలు వాయిదా వేసే అధికారం తమకు లేదని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ద్వివేది చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.