నెల్లూరులో మంత్రి నారాయణకు సన్నిహితంగా ఉన్న వారిపై పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. తాజాగా నగరంలోని బాలాజీనగర్‌లో నివసిస్తున్న నారాయణ కాలేజీ ఏజీఎం పద్మనాభరెడ్డి ఇంటిపై శుక్రవారం ఉదయం పోలీసులు సోదాలు నిర్వహించారు.

ఈ తనిఖీల్లో పద్మనాభరెడ్డి వద్ద నుంచి రూ.9 లక్షల నగదుతో పాటు ఓటరు లిస్ట్, స్లిప్పులు స్వాధీనం చేసుకున్నారు. ఆ ప్రాంతంలోని కొందరి ఇళ్లపైనా పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. 

"